మహేష్ బాబు.పి దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈసినిమాలో తన సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. ఈసినిమాలో అనుష్క చెఫ్ గా అలానే నవీన్ స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నారు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై ఈసినిమా మంచి ఎక్సెపెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాను ఆగష్ట్ 4వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఆదిశగానే ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరుపెంచి వరుసగా అప్ డేట్లు ఇచ్చారు. అప్ డేట్లు కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే ఇప్పుడు ఈసినిమాను చెప్పిన డేట్ కు రిలీజ్ చేయలేకపోతున్నట్టు తెలియచేశారు మేకర్స్. ఈనేపథ్యంలో చిత్రనిర్మాణ సంస్థ తాజాగా తమ ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియచేశారు. ఈసినిమాా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ లో ఉండటం వల్ల ఈసినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నాం.. అన్ లిమిటెడ్ ఫన్ ఇంకా ఎంటర్ టైనమెంట్ తో త్వరలోనే మీ ముందుకు వస్తాం.. ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ఇంకాా ట్రైలర్ కోసం వేచి ఉండండి అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
We apologize from the bottom of our hearts for this unforeseen delays.
We will soon be serving #MissShettyMrPolishetty, a comedic feast, with a side of laughter…
Stay tuned for the New release date and trailer… pic.twitter.com/LpMbdrVTsm
— UV Creations (@UV_Creations) July 29, 2023
కాగా ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రధన్ మ్యూజిక్ ఇస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























