ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య,విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం బేబి.నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్,టాక్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది.ముఖ్యంగా ఫస్ట్ ,సెకండ్ షోస్ దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్ కావడంతో భారీ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 7.1కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇందులో షేర్ 3.80 కోట్లు.దాంతో మరో 5కోట్ల షేర్ ను రాబడితే చాలు బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకోనుంది.ఈవారాంతానికి ఆమార్క్ ను క్రాస్ చేయనుంది.ఇక ఫుల్ రన్ లో ఈసినిమా భారీ లాభాలను తీసుకురానుంది.ఈరోజు అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ గా ఉండడంతో మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు యుఎస్ఏ లో కూడా ఈసినిమా అదరగొడుతుంది.ఇప్పటివరకు అక్కడ 150k డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.యూత్ ఫుల్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈసినిమాకు విజయ్ బుల్ గానిన్ సంగీతం అందించగా ఎస్ కె ఎన్ నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: