విశాల్ కొత్త సినిమాకు రాక్ స్టార్

rockstar devi sri prasad for vishals next movie

సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు విశాల్. రీసెంట్ గానే లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం అయితే మార్క్ అంథోని సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. వినాయకచవితి పండుగ సందర్భంగా ఈసినిమాను రిలీజ్ చేయనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తర్వాత మరో సినిమాను లైన్ లో పెట్టాడు విశాల్. హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఒక సినిమా వస్తుంది. భరణి, పూజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్టు ప్రకటించారు. హరితో సింగం 1, సింగం2 సినిమాలకు పనిచేశాడు దేవి. ఇక ఆ ఆల్బమ్స్ ఎంత హిట్టయ్యాయో తెలిసిందే. దీంతో ఇప్పుడు విశాల్ సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ నే తీసుకున్నాడు. మరి ఈసినిమాకు ఎలాంటి మ్యూజిక్ ను అందిస్తాడో చూడాలి.

కాగా మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కనున్న ఈసినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అలాగే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇంకా ఈసినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలయాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 5 =