ప్రాజెక్ట్ కే అంటే ఏమిటి..? దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం జులై 20వ తేదీ వరకూ వెయిట్ చేయాల్సిందే. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇక ప్రభాస్ హీరో అవ్వడం.. నాగ్ అశ్విన్ ఈసినిమాను రూపొందిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగా నాగ్ అశ్విన్ కూడా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి రెండు వీడియోలు రిలీజ్ చేశారు. స్క్రాచ్ నుండి టైర్ ను తయారు చేయడం.. స్క్రాచ్ నుంచి రైడర్స్ లుక్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో తెలుపుతూ వీడియోలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది జులై20వ తేదీన రాబోతున్న అప్ డేట్ కేసం. జులై 20వ తేదీన కామిక్ కాన్ ఈవెంట్ లో జరిగే రివీలేషన్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. అమెరికాలో జరగనున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె చిత్రబృందం పాల్గొననుంది. ఇక ఇదే ఈవెంట్ లో టైటిల్, ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా తెలుపుతామని ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు మేకర్స్. ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ జులై 20వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇక్కడ జులై 21న రిలీజ్ కానుంది.
The world awaits the ultimate showdown.
Brace yourselves for a glimpse into the world of #ProjectK on July 20 (USA) & July 21 (INDIA).Stay tuned and Subscribe: https://t.co/AEDNZ3ni5Q#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms… pic.twitter.com/MMc60mrHxH
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 14, 2023
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ ఇంకా దిశా పటాని కూడా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























