పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో మరికొద్దిరోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమా బ్రో. ఈసినిమా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం అనేే సినిమాకు రీమేక్ గా వస్తుంది. డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్ లో ఈసినిమా వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై ఉన్న క్యూరియాసిటీని ఇంకా పెంచుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, మై డియర్ మార్కండేయ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సర్ ప్రైజింగ్ వీడియోతో వచ్చేశారు. మై డియర్ మార్కండేయ సాంగ్ మేకింగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈపాట ఇప్పటికే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా పాటలో మామా అల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ గెటప్, స్టైల్, స్వాగ్ అదిరిపోయేలా ఉన్నాయి. ఈ స్పెషల్ సాంగ్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కూడా కనిపించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: