లాల్ సలామ్ షూట్ కంప్లీట్ చేసుకున్న రజనీ

rajinikanth wraps up his shoot of lal salaam movie

ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. స్పోర్ట్ బేస్డ్ ఇంకా మరియు మత కల్లోల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో రజనీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా నుండి రజనీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమాలో రజనీ మొయిదీన్ భాయ్ గా నటించనున్నాడు. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు రజనీకాంత్. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ కేట్ కట్ చేసి రజనీకి వీడ్కోలు పలికారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో జీవిత రాజశేఖర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తుంది. చాలా కాలం తరువాత జీవిత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

కాగా మరోవైపు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రజినీకాంత్ హీరోగా జైలర్ సినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ఆగష్ట్ 10 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈసినిమాలో రజినీకాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =