సూపర్ స్టార్ రజినీకాంత్,నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం జైలర్.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.అందులో భాగంగా రీసెంట్ గా ఈసినిమా నుండి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.కావాలయ్యా అంటూ సాగే ఈ సాంగ్ కేవలం వారం రోజుల్లోనే 30మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా నుండి రెండో పాటను కూడా విడుదలచేయనున్నారు.హుకుం అంటూ సాగే ఈ సాంగ్ ఈనెల 17న విడుదలకానుంది.మరి ఈ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.మలయాళ స్టార్ మోహన్ లాల్,కన్నడ స్టార్ శివరాజ్ కుమార్,జాకీ ష్రాఫ్,సునీల్, రమ్యకృష్ణ ఇలా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈసినిమాకి అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఈసినిమా ఆగస్టు 10న విడుదలకానుంది.
#Hukum 💥 Idhu Tiger-in Kattalai#JailerSecondSingle is ready to fire on July 17th 🔥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @kvijaykartik @Nirmalcuts… pic.twitter.com/5gqRMyXIcQ
— Sun Pictures (@sunpictures) July 13, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: