కన్ఫామ్.. బిగ్ బాస్ 7 హోస్ట్ గా కింగ్ నాగార్జున

king nagarjuna confirmed as bigg boss season 7 host

బుల్లి తెర ప్రేక్షకులకు రియాలిటీ షో బిగ్ బాస్ అగురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షోకు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ షో ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ఇప్పటికే 6 సీజన్లు పూర్తి కాగా ఇప్పుడు ఏడో సీజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజానికి ఈసీజన్ ఎప్పుడో మొదలవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. దీంతోో అసలు ఈ సీజన్ ఉంటుందా అన్న అనుమానాలు కూాాడా వచ్చాయి. అయితే ఆ అనుమానాలన్నింటికీ ప్రోమోతో బ్రేక్ పడింది. రెండు రోజుల క్రితమే ఈ సీజన్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సీజన్ కు హోస్ట్ గా కింగ్ నాగార్జున ఉంటారా?లేదా? అని పలు అనుమానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ అనుమానాలకు బ్రేక్ పడింది. ఈ సీజన్ కు కూడా నాగార్జునానే హోస్ట్ గా నిర్వహించనున్నారు. ఇక ఈవిషయాన్ని అధికారికంగా కన్ఫామ్ చేశారు నిర్వాహకులు.

ఇదిలా ఉండగా అప్పుడే ఈసీజల్ పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ అంటూ కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రభాకర్, కార్తీకదీపం శోభా శెట్టి, బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ మోహన భోగరాజు, ఢీ పండు, సిద్ధార్థ వర్మ, అమర్ దీప్ తేజస్విని జంటతో పాటు పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వారిలో ఎంతమంది ఉంటారో? ఉండరో ? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − eleven =