VT13 యాక్షన్ షెడ్యూల్ పూర్తి- డిసెంబర్‌లో రిలీజ్

Varun Tej 13th movie Action Schedule Completed

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం తను చేస్తున్న గాండీవధారి అర్జున సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేసుకొని త్వరలో రిలీజ్ కానుంది. ఇక దీనితో పాటు వరుణ్ తేజ్ ఇంకా టైటిల్ పెట్టని VT13 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఇండియన్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రంగా తెలుగు-హిందీ ద్విభాషల్లో ఈసినిమాను రూపొందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా కూడా షూటింగ్ ను మొదలుపెట్టింది. కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. చిత్రయూనిట్ గత కొన్ని రోజులుగా అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఒక ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తోంది. అక్కడ ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ని భారీ స్థాయిలో చిత్రీకరించారు చిత్రయూనిట్. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్టు తెలియచేశారు.

కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 9 =