నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెవిల్.ప్రయోగాలు చేయడంలో ముందుండే కళ్యాణ్ రామ్ ఈసారి కూడా అదే పంథాను ఎంచుకున్నాడు.బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ఇంట్రస్టింగ్ సబ్జెక్టు తో వస్తున్నాడు.ఇందులో కళ్యాణ్ రామ్ గూఢచారిగా నటిస్తున్నాడు.ఇక ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్బంగా డెవిల్ నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఈగ్లింప్స్ చాలా ఇంట్రెస్టింగ్ వుంది.విజువల్స్, కళ్యాణ్ రామ్ లుక్ గ్లింప్స్ లో హైలైట్ అయ్యాయి.ఓవరాల్ గా గ్లింప్స్ ను ఇంట్రస్టింగ్ గా కట్ చేసి సినిమా కు హైప్ పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్వరలోనే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్నాడు.హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ ఫై అభిషేక్ నామ నిర్మిస్తున్నాడు.ఈఏడాది చివర్లోలో ఈసినిమా విడుదలకానుంది.
ఇదిలావుంటే గత ఏడాది బింబిసారతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఈఏడాది అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు.అయితే ఈసినిమా అంచనాలను అందుకోలేకపోయింది.మరి ఇప్పుడు డెవిల్ తో కళ్యాణ్ రామ్ మరోసారి బింబిసార ఫలితాన్ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: