మ్యూచువల్ గా విడిపోయాం- ప్రైవసీ కోరుకుంటున్నాం

niharika konidela first reaction on her divorce with chaitanya

ఈమధ్య ఇన్ట్సాలో ప్రొఫైల్స్ ద్వారా సెలబ్రిటీలు కలిసి ఉన్నారా..విడిపోతున్నారా అనే విషయాలు తెలుస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా ఇన్ట్సాలో ప్రొఫైల్ నేమ్ ను మార్చి విడియాపోయామంటూ హింట్స్ ఇస్తున్నారు. సమంత-నాగ చైతన్య విడిపోయినప్పుడు కూడా ఇదే జరిగింది. ఆ మధ్య చిరు కూతురు శ్రీజ కూడా తన ప్రొఫైల్ నేమ్ ను మార్చేసింది. ఆ తరువాత నిహారిక విషయంలో కూడా ఇన్ట్సా ద్వారా క్లారిటీ వచ్చింది. గత కొద్ది రోజులుగా నిహారిక-చైతన్య విడిపోయారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి నిహారికకు సంబంధించిన ఫొటోలను డిలీట్ చేయడం.. ఆతరువాత నిహారిక తన పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడంతో విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు విడాకులు కూడా తీసుకున్నారన్నారు. అయితే అప్పటినుండీ వార్తలు వస్తున్నా ఇంతవరకూ అధికారికంగా అయితే కన్ఫామ్ చేయలేదు. కానీ తాజాగా తాము విడిపోయామంటూ నిహారిక ఎట్టకేలకు కన్ఫామ్ చేసేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చైతన్య నేను ఇద్దరం మ్యూచువల్ గానే నిర్ణయం తీసుకొని విడిపోయాం..మేం తీసుకున్న నిర్ణయాన్ని అంద‌రూ గౌర‌వించాల‌ని.. ఇంత‌కాలం మాకు అండ‌గా నిలిచిన కుటుంబం స‌భ్యుల‌కు, స‌న్నిహితుల‌కు థ్యాంక్స్.. విడాకుల త‌ర్వాత మేమిద్ద‌రం కొత్త‌గా ప్రారంభించే వ్య‌క్తిగ‌త జీవితంలో ప్రైవ‌సీని కోరుకుంటున్నామ‌ని త‌న ఇన్ట్సాలో పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

కాగా నాగబాబు కూతురిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక మొదట యాంకర్ గా బుల్లితెరపై సందడి చేేసింది. ఆ తరువాత హీరోయిన్‌గా చేసింది కానీ హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేక పోయింది. ఇక ఇప్పుడు నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక నిహారిక- చైతన్య వివాహం
2020 డిసెంబర్ 9న ఘనంగా జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకే నిహారిక, చైతన్య మధ్య మనస్పర్దలు రావడం ఆఖరికి విడాకులు తీసుకొని విడిపోవడం వరకూ జరిగిపోయింది. ఈమధ్యే నిహారిక హైద‌రాబాద్‌లో త‌న ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి కొత్త ఆఫీస్‌ను ఓపెన్ చేసింది. ఇకపై నిర్మాతగానే కెరీర్ పై ఫోకస్ చేయనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =