విలక్షణ నటుడు కమల్ కూడా ఒక సినిమా తరువాత ఒక చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది విక్రమ్ తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఇదిలా ఉండగా మణిరత్నంతో కూడా కమల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. KH 234అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా రానుంది. మరోవైపు తెలుగులో ప్రభాస్ `ప్రాజెక్ట్ కే`లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగాా వీటితో పాటు కమల్ హెచ్ వినోద్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈసినిమాను మొదటుపెట్టనున్నట్టు తెలుపుతూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. రైజ్ టూ రూల్ అనే ట్యాగ్ లైన్‌తో వస్తోంది. ఇక వీడియోలో కమల్ జెండా పట్టుకుని ఓ నాయకుడిగా పోరాడుతున్నట్టు, ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.
And it begins…#RKFI52 #KH233
#RISEtoRULE #HVinoth #Mahendran @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/7cej87cghE— Kamal Haasan (@ikamalhaasan) July 4, 2023
కాగా ఈసినిమా రైతుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాను రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ పతాకంపై కమల్ హాసన్, మహేంద్రన్ నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాలో మరో టాలెంటెడ్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఆ నటుడు ఎవరో కాదు విజయ్ సేతుపతి. గతంలో కమల్, విజయ్ కలసి ‘విక్రమ్’ లో నటించారు. తాజాగా మరోసారి వీరిద్దరు స్క్రీన్‌ను షేర్ చేసుకొబోతుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఇంకా కమెడియన్ యోగిబాబు కూడా నటిస్తున్నట్టు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: