తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. జిగర్ తండ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ కేటగిరీలోకి వెళ్లిపోయాడు కార్తీక్ సుబ్బరాజు. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. జిగర్ తండ డబుల్ ఎక్స్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని కార్తీక్ సుబ్బరాజు తెలిపాడు. చిత్రయూనిట్ షూటింగ్ అయిన సందర్భంలో సెలబ్రేషన్ చేసుకుంటున్న పిక్ ను పోస్ట్ చేస్తూ షూటింగ్ పూర్తయిందని.. దీపావళి పండుగకు ఈసినిమాను రిలీజ్ చేస్తున్నామని.. థియేటర్లలో కలుద్దాం అంటూ తెలిపాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమా లో లారెన్స్ హీరో గా నటిస్తుండగా ఎస్ జే సూర్య కూడా మరో హీరో గా నటిస్తున్నాడు. ఇక ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. తిరునవుక్కరుసు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
కాగా జిగర్ తండ సినిమాలో సిద్దార్థ్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. అంతేకాదు బాంబీ సింహాకు నేషనల్ అవార్డు సైతం దక్కింది. ఇక ఈసినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. హారీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా గద్దల కొండ గణేష్ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈసినిమా హిట్ ను అందుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: