సామజవరగమన పై బన్నీ ప్రశంసలు- మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

icon star allu arjun praises on sri vishnu samajavaragamana movie

తనకు నచ్చిన సినిమాను సోషల్ మీడియా ద్వారా ప్రశంసించడం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అలవాటే. ఇప్పటికే ఎన్నో సినిమాలను తన సోషల్ మీడియా ద్వారా ప్రశంసించారు.. అవసరమైతే చిత్రయూనిట్ ను పిలిపించుకొని స్వయంగా వారితో ముచ్చటించి అభినందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో సినిమాపై కూడా తన ప్రశంసలు కురిపించాడు బన్నీ. ఆ సినిమా మరేదో కాదు రీసెంట్ గా రిలీజ్ అయిన శ్రీవిష్ణు సినిమా సామజవరగమన.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సామజవరగమన మూవీ టీమ్‌కి కంగ్రాచ్యూలేషన్స్.. చాలా కాలం తరవాత ఒక మంచి తెలుగు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూశాను. సినిమా ప్రారంభం నుంచి ఆఖరి వరకు చాలా ఆస్వాదించాను. దర్శకుడు రామ్ అబ్బరాజు చాలా బాగా కథను రాసుకున్నారు, అంతే చక్కగా తెరకెక్కించారు. శ్రీవిష్ణు అదరగొట్టాడు. నరేష్, వెన్నెల కిషోర్, నా మలయాళీ రెబా మోనికా జాన్, ఇతర నటీనటులు మంచి సపోర్ట్ ఇచ్చారు. సాంకేతిక నిపుణులు, నిర్మాతల కష్టానికి ఫలితం దక్కింది. ఇది 100 శాతం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి కూడా విదితమే. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈసినిమా తెరకెక్కుతుంది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇక తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అది కూడా త్రివిక్రమ్ తో. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ హిట్ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఇప్పటినుండే ఏర్పడ్డాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 16 =