కాకినాడలో NBK 111 షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం

Balakrishna Injured During ‘NBK 111’ Shoot in Kakinada

నటసింహం నందమూరి బాలకృష్ణకు షూటింగ్ స్పాట్‌లో ప్రమాదవశాత్తూ మోకాలికి స్వల్ప గాయమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘NBK 111’(వర్కింగ్ టైటిల్) షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటుడు మంచు మనోజ్‌తో కలిసి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ కాలు జారి కిందపడటంతో ఆయన మోకాలికి దెబ్బతగిలింది. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ షూటింగ్‌ను నిలిపివేసి, ఆయనకు వైద్య సహాయం అందించారు.

ఈ ఘటనపై దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందిస్తూ, “కాకినాడలో యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో బాలకృష్ణ గారికి చిన్న మసిల్ టియర్ అయింది.ఆయన త్వరగా కోలుకోవడానికి వైద్యుల సూచన మేరకు ఒక చిన్న మైనర్ శస్త్రచికిత్స అవసరమని తెలిపారు.

ఇది చాలా సాధారణ ప్రక్రియ అని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన త్వరలోనే పూర్తి కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర బృందం స్పష్టం చేసింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.