చిరంజీవి గారే మా అందరికీ అతిపెద్ద ఇన్స్పిరేషన్ – కిరణ్ అబ్బవరం

Hero Kiran Abbavaram’s Speech at the Chennai Love Story Pre-Release Event

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఫీల్ గుడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 24న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కథానాయకుడు కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “మా లాంటి కుర్రాళ్లు, ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నిలబడగలిగామంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన ప్రయాణమే మా అందరికీ ఒక పెద్ద మార్గదర్శకం, ఇన్స్పిరేషన్. నా సినిమా వేడుకకు ఆయన రావడం నా జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం. ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రయాణంలో మేమంతా ఎంతో ప్రేమతో, కష్టపడి పనిచేశాం. మణిశర్మ గారి అద్భుతమైన సంగీతం, సాయి రాజేష్ గారి కథ, రవి నంబూరి గారి మేకింగ్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి అనుభూతితో వస్తారు” అని నమ్మకం వ్యక్తం చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.