అల్లరి నరేష్ హీరోగా, చందూ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో-ఫాంటసీ కామిక్ ఎంటర్టైనర్ రంభ ఊర్వశి మేనక నుండి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఒక బ్యూటిఫుల్ లవ్ మెలోడీతో గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా ప్రేమికులను అలరించే అందమైన ప్రణయ గీతం ‘నా కంటి మీద కునుకే’ అనే మొదటి పాటను జులై 22వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చేతన్ భరద్వాజ్ అందించిన స్వరాలకు ప్రముఖ రచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించగా, గాయకుడు ధనంజయ్ ఈ పాటను ఆలపించారు. ఈ రోమాంటిక్ మెలోడీ పాట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
హాస్య మూవీస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నిర్మాతలు రాజేష్ దండా, ప్రసాద్ నిర్మిస్తుండగా, దర్శకుడు చంద్ర మోహన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.సెప్టెంబర్ 4న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























