టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు స్పై గా వచ్చేస్తున్నాడు నిఖిల్. గారీ బి.హెచ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. నేతాజీ మరణం మిస్టరీని ఛేదించే క్రమంలో సాగే యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్‌తో చెప్పేశాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా జూన్29వ తేదీన రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా రిలీజ్ డేట్ వాయదా పడే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా యూఎస్ ప్రీమియర్ షోస్ 28 వ తేదీన పడనున్నట్టు తెలిపారు. యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వారు జూన్ 28వ తేదీన ప్రీమియర్స్ పడనున్నట్టు కన్ఫామ్ చేశారు. అలాగే యూఎస్ లో భారీ మొత్తంలో ఈ చిత్రం 450కి పైగా లొకేషన్స్ లో అయితే ఈ చిత్రం రిలీజ్ కాబోతున్నట్టుగా తెలియచేశారు. దీనితో చెప్పిన డేట్ కే స్పై సినిమా రాబోతుందని.. అవన్నీ రూమర్సే అని క్లారిటీ ఇచ్చారు.
The countdown begins for a thrilling spy adventure! 🔥#SPY is set to make its USA premieres on June 28th, hitting 450+ locations across the nation ❤️🔥
Bookings open from MONDAY! 🎟️ #IndiasBestKeptSecret 🇮🇳
USA Release by @PrathyangiraUS @actor_Nikhil @Ishmenon @Garrybh88… pic.twitter.com/kYMdS4QP1B
— Prathyangira Cinemas (@PrathyangiraUS) June 12, 2023
కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఇంకా ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రూపొందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: