నా నెక్ట్స్ సినిమా.. రీమేక్ కాదు

allu sirish new movie update

అల్లు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో అల్లు శిరీష్. గౌరవం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తరువాత వరుసగానే సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. సినిమాల ఫలితాల విషయం పక్కన పెడితే, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు శిరీష్. అయితే మొదట్లో చాలా స్పీడుగా సినిమాలు చేస్తూ ఉండేవాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వెంట వెంటనే చేసేవాడు. అయితే ఈమధ్య సినిమాకు సినిమాకు గ్యాప్ మాత్రం ఎక్కువగానే వస్తుంది. ఆ మధ్య ఏబీసీడీ సినిమా చేసిన తరువాత చాలా గ్యాప్ తో ఊర్వశివో రాక్షసివో సినిమా చేశాడు. ఊర్వశివో రాక్షసివో సినిమా రిలీజ్ అయి కూడా చాలా కాలమైపోయింది. ఇప్పటివరకూ ఎలాంటి కొత్త సినిమా గురించిన అప్ డేట్ ఇవ్వలేదు శిరీష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఇప్పుడు తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన ఇచ్చాడు అల్లు శిరీష్. తమ సోషల్ మీడియా ద్వారా ఈసినిమా అప్ డేట్ ఇచ్చాడు. అంతేకాదు కొత్త సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. పక్కనే టెడ్డీ బేర్‌తో వెనక్కి తిరిగి నిలబడి ఉన్న అల్లు శిరీష్‌ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. నా తరువాత సినిమా.. నేను నా కో స్టార్.. మా ఫస్ట్ లుక్ ఇంకా గ్లింప్స్ రేపు అంటే మే 30వ తేదీన అధికారిక ప్రకటించనున్నాం అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. అంకతేకాదు ఈసినిమా రీమేక్ కాదు అన్న క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే శిరీష్ క్లారిటీ ఇవ్వడానికి కూడా ఒక కారణం లేకపోలేదు. పోస్టర్ ను చూసిన వెంటనే గతంలో ఆర్యన్ ప్రధాన పాత్రలో వచ్చిన టెడ్డీ మూవీ గుర్తురాకమానదు. అందుకే శిరీష్ ప్రత్యేకంగా క్లారిటీ ఇచ్చినట్టు అర్థమవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − five =