పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాను రామాయణం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు ఓం రౌత్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఈసినిమా జూలై 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ మాత్రం పెద్ద ఎత్తునే ప్రచారాలు మొదలుపెట్టారు. ఇప్పటికే చిత్రయూనిట్ అంత ఇంటర్వ్యూస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ దక్కింది. విజువల్ వండర్ గా ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇక రోజూ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి జైశ్రీరామ్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈపాట గ్లింప్స్ ను ఎప్పుడో రిలీజ్ చేశారు.. ఫుల్ సాంగ్ ను నేడు రిలీజ్ చేస్తామని తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఊహించినట్టే ఈసాంగ్ వినడానికి వేరే లెవల్లే ఉంది. సిల్వర్ స్క్రీన్ పై ఈసినిమా గూజ్ బంప్స్ తెప్పిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అజయ్-అతుల్ సంగీతం అందించగా రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: