ఉస్తాద్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

sri simha ustaad movie first single release date fixed

మత్తు వదలరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు శ్రీసింహా. అంతేకాదు నటన పరంగా కూడా చాలామందిని ఆకట్టుకున్నాడు. ఆ తరువాత తెల్లవారితే గురువారం, ఇంకా దొంగలున్నారు జాగ్రత్త లాంటి సినిమాలు చేశాడు కానీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తున్నాడు. ఫణదీప్ దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఒకవైపు రిలీజ్ కు సిద్దమవుతూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాడు. దీనిలోభాగంగానే ఈసినిమా టీజర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. రోజూ అంటూ వచ్చే ఫస్ట్ సింగిల్ ను మే23 వ తేదీన ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. మసూద, బలగం సినిమాలతో ప్రస్తుతం కావ్య కూడా ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. వారాహి చలన చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అకీవా బి సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =