కార్తికేయ 2 తో కెరీర్ లో మొదటి సారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నిఖిల్.ఈసినిమా తెలుగులోనే కాదు హిందీలో కూడా కాసుల వర్షం కురిపించింది.చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈసినిమా నిఖిల్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను ఇవ్వడమే కాదు హిందీలో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసింది.ఇక ఇప్పుడు నిఖిల్, స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ తో రానున్నాడు.కొద్దిసేపటి క్రితం ఢిల్లీ లోని కర్తవ్య పాత్ దగ్గర ఉన్న నేతాజీ విగ్రహం వద్ద ఈ ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.ఈటీజర్ సినిమా ఫై అంచనాలను పెంచేసింది.నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి తెలియని నిజాలను ఈసినిమాలో చూపెట్టే ప్రయత్నం చేశారు.యాక్షన్ సీన్స్,విజువల్స్ ఈటీజర్ లో హైలైట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా టీజర్ అయితే ఆసక్తిగా ఉండి సినిమా కు హైప్ తీసుకొచ్చింది.గ్యారీ బిఎచ్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా మకరంద్ దేశ్ పాండే, అభినవ్ గోమఠం,సన్యా ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.శ్రీ చరణ్ పాకాల,విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.జూన్ 29న ఈసినిమా తెలుగుతోపాటు హిందీలో కూడా విడుదలకానుంది.మరి ఈసినిమా తో నిఖిల్ ఎలాంటి పలితాన్ని పొందుతాడో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: