ఉప్పెన తో హీరో గా ఎంట్రీ ఇచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ అయితే ఈసినిమా తరువాత కొండపొలం,రంగరంగ వైభవంగా చేశాడు.ఈరెండు కూడా నిరాశనే మిగిల్చాయి.ఇక ఇప్పుడు నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తో తన నాల్గువ సినిమా చేస్తున్నాడు.కొద్దీ సేపటి క్రితం ఈ సినిమా గ్లింప్స్ తోపాటు టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు.ఈసినిమాకు ఆదికేశవ అనే మాస్ టైటిల్ ను ఖరారు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గ్లింప్స్ విషయానివస్తే 47 సెకండ్ల తో వచ్చిన వీడియోలో ఊరిలో గుడిని కూల్చడానికి ప్రయత్నించే విలన్.. దాన్ని అడ్డుకునే హీరో సినిమాలో ఇదే మెయిన్ ప్లాట్ కానుందని తెలుస్తుంది. రుద్ర కాళేశ్వర్ రెడ్డి అనే పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపించనున్నాడు.ఈవీడియో చూస్తే వైష్ణవ్ తన కెరీర్ లో మొదటిసారి ఫుల్ యాక్షన్ మూవీ తో వస్తున్నాడు మరి ఈసినిమా అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4సినిమాస్,శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటుడు జోజు జార్జ్,అపర్ణ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతంఅందిస్తున్నాడు.ఈఏడాది జూలై లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: