కస్టడీ అండర్ వాటర్ సీక్వెన్స్ మేకింగ్

custody movie under water sequence making video out

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వస్తున్న సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో నాగచైతన్య కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా మే 12వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని ఇప్పటికే మేకర్స్ తెలిపిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో ఉన్న వాటర్ సీక్వెన్స్ లు ఇప్పటివరకూ ఏ సినిమాలో రాలేదని..
ఆ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని.. ఆ సన్నివేశాల్ని మైసూర్, రాజమండ్రిలో దాదాపు 20 రోజులు కష్టపడి ఆ సీన్స్ ని తెరకెక్కించాం.. సినిమాకు ఆ సీన్స్ చాలా ప్లస్ అవ్వనున్నాయి అని నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఈ సీక్వెన్స్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను పోస్ట్ చేసి మరింత ఆసక్తి పెంచారు మేకర్స్.

కాగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =