పెళ్లి సందడితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగులో ఫుల్ బిజీ అయిపోయింది కన్నడ బ్యూటీ శ్రీలీల.ఈసినిమా తరువాత రవితేజతో ధమాకాలో నటించింది.ఇక్కడి నుండి ఆమె ఫేట్ మారిపోయింది.ఈసినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వడమే కాదు శ్రీలీలకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.ధమాకాలో శ్రీలీల గ్లామర్,డాన్స్ యూత్ ను ఫిదా చేసింది.ఇంతకుముందు వరకు ఆమె చేతిలో ఏకంగా 8సినిమాలు ఉండగా తాజాగా మరో సినిమాకు సైన్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ,జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈసినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించనుంది.ఈరోజే ఈసినిమా అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చ్యూన్ 4సినిమాస్,శ్రీకరా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా కాకుండా ప్రస్తుతం శ్రీలీల చేతిలో మరో 8సినిమాలు వున్నాయి.అందులో మహేష్ బాబు 28 సినిమా కూడా ఒకటి ఈసినిమాలో శ్రీ లీల ఓ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ లో ఓ హీరోయిన్ గా నటిస్తుంది.ఈసినిమాలతోపాటు నితిన్ 32,వరుణ్ తేజ్ 4,జూనియర్,అనగనగ ఒక రాజు,బోయపాటి రామ్ సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇవి కాకుండా అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో శ్రీ లీల కీలకమైన పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం శ్రీ లీల ఈ సినిమా షూటింగ్ లోనే పాల్గొంటుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: