ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ క్రేజీ కాంబినేషన్స్ అన్నీ సెట్ అవుతున్నాయి. ఈమధ్య కాలంలో అలాంటి కాంబినేషన్స్ ఎన్నో వచ్చి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేశాయి కూడా. ఇప్పుడు మరో క్రేజీ కాంబో సెట్ అయింది. ఆ కాంజినేషన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, యంగ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ఓ సినిమా రాబోతుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా విజయ్ హీరోగా ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. విజయ్ దేవరకొండ 12వ చిత్రంగా ఈసినిమా రాబోతుంది. ఇక కాగా నేడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. త్వరలో షూట్ ను స్టార్ట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంస్థలు ఈసినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈసినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారికంగా ఎమోషనల్ అండ్ పవర్ ఫుల్ రోల్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై ఇప్పటినుండే క్రేజ్ పెరిగిపోయింది. చూద్దాం ఈసినిమా ఎలా ఉండబోతుందో.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇంకా ఈసినిమాతో పాటు పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. మరోవైపు శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో మండి డిమాండ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల. యంగ్ హీరోలతో పాటు, స్టార్ హీరోలు అలానే పెద్ద హీరోల పక్కన పలు సినిమాలు చేస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: