టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ ఛత్రపతిని ఇప్పుడు హిందీలోకి తీసుకెళ్తున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.హిందీలో అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.ఇందులో ప్రభాస్ నటించిన పాత్రలో సాయి శ్రీనివాస్ నటిస్తుండగా వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు.మేకింగ్ లో పెద్దగా మార్పులు ఏమి చేయడం లేదు కానీ ఒరిజినల్ వెర్షన్ కంటే ఈరీమేక్ లో ఎక్కువ యాక్షన్ సీన్స్ ను ఆడ్ చేస్తున్నారని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది.ఇక నిన్న ఈట్రైలర్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు యూట్యూబ్ లో 5మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లో వుంది.సాయి శ్రీనివాస్ నటించిన సినిమాలు హిందీ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.జయజానకి నాయక హిందీ లో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేయగా 710మిలియన్ల కు పైగా వ్యూస్ రాబట్టి చరిత్ర సృష్టించింది. దాంతో ఛత్రపతి కూడా హిందీలో కూడా బాగా ఆడుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు శ్రీనివాస్.
పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నుశరత్ బరూచా హీరోయిన్ గా నటిస్తుండగా శరద్ కేల్కర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తనిష్క్ బాఘ్చి సంగీతం అందిస్తున్నాడు.మే12 న ఈ సినిమా విడుదలకానుంది.ఈసినిమా తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్ట్రయిట్ తెలుగు మూవీ చేయనున్నాడు.భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్న ఈసినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: