గతకొద్దికాలంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒక్క టాలీవుడ్ లోనే చాలా మంది లెజెండరీ నటీనటులు కృష్ణ, కృష్ణంరాజు, చలపతిరావు, జమున, డైరెక్టర్ కె విశ్వనాథ్ లాంటి వాళ్లు మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక ఇప్పుడు మరో వెటరన్ నటుడు కన్నుమూశారు. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మనోబాల నేడు తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇక ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మనోబాల మృతి పట్ల సినీ సెలబ్రిటీలు ఇంకా అభిమానులను విచారం వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మనోబాల 1979లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన పుతియ వర్పుగల్ సినిమాతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆసినిమాకే సహాయ దర్శకత్వం కూడా వహించారు ఆయన. తన సినీ కెరీర్ లో దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించారు. తమిళ్ తో పాటు తెలుగు, మలయాళ భాషల్లో కూడా ఆయన సినిమాలు చేశారు. తమిళ్ లో ఆయన కనిపించిన చివరి సినిమా కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఘోస్టీ’. తెలుగులో చివరి సారిగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కనిపించారు. ఇక దర్శకుడిగా కూడా పనిచేశారు ఆయన. సుమారు 25 సినిమాలు డైరెక్ట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: