సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది.ఐపీఎల్ ఎఫెక్ట్ అలాగే కొత్తగా రిలీజ్ అయినా సినిమాలను తట్టుకొని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను దక్కించుకుంటుంది.మాత్ టాక్ సూపర్ గా ఉండడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.ఇక నిన్న ఈసినిమా సెన్సేషన్ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 6కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అదుర్స్ అనిపించింది.ఓవరాల్ గా 10రోజుల్లో ఈసినిమా 75కోట్ల వసూళ్లను రాబట్టింది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కూడా లేకపోలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Audience can't get off the Thrill Ride 💥
Spine-Chilling Thriller #Virupaksha is going Super strong on DAY 10 Grossing 76Crores 🔥🤩
Book your tickets#BlockbusterVirupakshahttps://t.co/HzG8SAA8rz@IamSaiDharamTej @iamsamyuktha_@karthikdandu86 @SVCCofficial @SukumarWritings pic.twitter.com/ADrAJ7gdMO
— SVCC (@SVCCofficial) May 1, 2023
తెలుగు రాష్ట్రాల్లో నిన్న చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడడం తో 2.5కోట్ల షేర్ ను రాబట్టింది.దాంతో ఇప్పటివరకు ఈరెండు రాష్ట్రాల్లో 30కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.మరోవైపు విరూపాక్ష,సాయి ధరమ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.ఈసినిమా తమిళ,హిందీ,మలయాళ భాషల్లో కూడా విడుదలకు సిద్దమవుతుంది.
మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమాలో ట్విస్టులు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్,స్క్రీన్ ప్లే,సంయుక్త మీనన్ నటన హైలైట్ అయ్యాయి.కార్తీక్ దండు డైరెక్ట్ చేయగా ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ నిర్మించాయి.ఈసినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: