కార్మికులకు భోళాశంకరుడి శుభాకాంక్షలు

bhola shankar movie team may day wishes with chiranjeevi new posters

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. అయితే రెండు బ్లాక్ బస్టర్ల తరువాత వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాతో చిరు హ్యాట్రిక్ కొడతాడేమో అని చూస్తున్నారు. ఈసినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.ఇక నేడు మే డే సందర్భంగా శుభాకాంక్షలు అందచేశారు మేకర్స్. కార్మికులకు, కర్షకులకు, శ్రమజీవులు అందరికీ మే డే శుభాకాంక్షలు అంటూ చిరు స్పెషల్ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఇక ట్యాక్సీ డ్రైవర్ గా స్టైలిష్ లుక్ లో ఉన్న చిరు పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సుశాంత్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు. ఆగష్ట్ 11 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =