ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ నుండి ఇటీవల వచ్చిన అప్డేట్స్ యూట్యూబ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఓ కీలక షెడ్యూల్ ను షూట్ చేస్తున్నారు. ఈ సెట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యక్షమయ్యాడు. నిన్న పుష్ప ది రూల్ సెట్ ను సందర్శించిన ఎన్టీఆర్.. అల్లు అర్జున్,సుకుమార్ తో కాసేపు సంభాషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎన్టీఆర్ నటిస్తున్న ఎన్టీఆర్ 30 కూడా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లోనే షూటింగ్ జరుపుకుంటుంది.దాంతో ఫ్రీటైం లో ఎన్టీఆర్,పుష్ప 2 సెట్ లో సందడి చేశాడు. ఇడిలావుంటే పుష్ప ది రూల్, ఎన్టీఆర్ 30 సినిమాలపై భారీ అంచనాలు వున్నాయి.రెండు పాన్ ఇండియా మూవీస్ కావడంతో తెలుగులోనే కాదు హిందీ లోనూ ఈసినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బ్లాక్ బాస్టర్ మూవీ పుష్పకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ఇక కొరటాల శివ డైరెక్షన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఎన్టీఆర్30.జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమాకు పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈసినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: