ఆదిపురుష్ నుండి రీసెంట్ గా జై శ్రీరామ్ అనే లిరికల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నిమిషం రన్ టైం తో విడుదలచేసిన ఈ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. హిందీతోపాటు అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయగా తెలుగు వెర్షన్ యూట్యూబ్ లో ఇప్పటివరకు 61లక్షలకు పైగా వ్యూస్ ను రాబట్టుకుని ట్రెండింగ్ లో కొనసాగుతుంది.రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ను అందించగా అజయ్-అతుల్ సంగీతం అందించారు. ఇక ఈ పాట చివర్లో రాముడి గెట్ అప్ లో బాణం గురిపెడుతూ ప్రభాస్ కనిపించాడు. ఆషాట్ నెటిజన్లను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా విఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడడం లేదు మేకర్స్.సూపర్ క్వాలీటితో సినిమాను తీర్చిదిద్దుతున్నారని తాజాగా రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ ను చూస్తేనే అర్ధమవుతుంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా తానాజీ ఫేమ్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ సీతగా కృతి సనన్ ,లక్ష్మణుడిగా సన్నీ సింగ్,హనుమంతుడిగా దేవదత్తా నాగే ,రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.
టి సిరీస్,రిట్రో ఫిలిమ్స్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్,రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈఏడాది జూన్ 16న పాన్ ఇండియా మూవీ గా ఆదిపురుష్ 3డిలో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: