అజయ్ భూపతి మంగళవారం ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్

ajay bhupathi mangalavaaram movie first look release date and time fixed

ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి గుర్తింపును పొందాడు. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి అజయ్ భూపతికి విమర్శకుల నుండి ప్రశంసలు సైతం లభించాయి. ఇక ఆర్ఎక్స్ 100 మూవీ తర్వాత అజయ్ భూపతి శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అను ఇమ్మాన్యూయల్, అదితి రావు హైదరి హీరోయిన్ లుగా మహా సముద్రం అనే మూవీ ని రూపొందించాడు. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు అజయ్ తన మూడో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాను కూడా రస్టిక్ అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమాకు మంగళవారం అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. తాజాగా ఈసినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్, టైమ్ ను ప్రకటించారు. ఏప్రిల్ 25 వ తేదీన ఉదయం 10 గంటల 10 నిమిషాలకుఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా కూడా మారుతున్న సంగతి తెలిసిందే. ఏ క్రియేటివ్ వర్క్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి దీనికి ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కాంతార సెన్సేషన్ అజనీష్ లోక్ నాథ్ పనిచేయనున్నారు. ఇంకా ఈసినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − seventeen =