బన్నీ, అర్హ క్యూట్ వీడియో

allu arjun shares cute video with allu arha

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో కూడా చాలా టైమ్ స్పెండ్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. టైమ్ దొరికినప్పుడల్లా ప్యామిలీతో ట్రిప్ లకు సైతం వెళుతుంటాడు. అంతేకాదు తన పిల్లలు అర్హ, అయాన్ లకు సంబంధించిన క్యూట్ వీడియోస్ ను కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటాడు. ముఖ్యంగా అర్హ అల్లరి పనులను, వారిద్దరూ కలిసి చేసే చిలిపి పనులను ఫ్యాన్స్ తో పంచుకంటూ ఉంటాడు బన్నీ. తాజాగా అలాంటి ఒక క్యూట్ వీడియోనే పోస్ట్ చేశాడు బన్నీ. కారులో ఇద్దరూ ఎక్కడికో వెళుతుండగా.. అల్లు అర్హ మొహం చూపించకుండా చేతులతో కవర్ చేస్తుంటే.. బన్నీ అర్హ మొహన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడ ఈవీడియో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇప్పటికే తన అల్లరితో, క్యూట్ వీడియోలతో ఇంత చిన్న వయసులోనే ఎంతో పాపులర్ అయింది అర్హ. ఇక నటనలో కూడా అల్లు అర్హ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. శాకుంతలం సినిమాలో అల్లు అర్హ బాల భరతుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. అయితే సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా అర్హ నటనకు మాత్రం ఫుల్ మార్కులు పడ్డాయి. ఇంత చిన్న వయసులో తన నటనతో అందరినీ ఫిదా చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

ఇక బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే తను పుష్ప2 సినిమా షూటింగ్ లో  బిజీగా ఉన్నాడు. పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + three =