సుధీర్ బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమాలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నాడు. దుర్గ అనే పాత్రలో, గ్యాంగ్ స్టర్ లా ఉండే పరుశురామ్ పాత్రలో ఇంకా డీజే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రేపు అంటే ఏప్రిల్ 22 వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపు ఉదయం 10 గంటల 33 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అంతేకాాదు మేకర్స్ మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The ‘Reigning Superstar’ @urstrulyMahesh to launch the FREAKY & Entertaining TEASER of #MaamaMascheendra 🤟🏻🤩
Be Ready to get Amazed 💥
TOMORROW @ 10:33 AM ⏰@isudheerbabu @HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @chaitanmusic @SVCLLP #SrishtiCelluloids @adityamusic pic.twitter.com/WJx5fpo8pf— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) April 21, 2023
కాగా ఈసినిమాలో ఈషారెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈషా పుట్టినరోజు సందర్భంగా తన పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో ఈషా వైరల్ విశాలాక్షి అనే పాత్రలో నటిస్తుంది. ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీజీ విందా సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: