అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉగ్రం. నాంది సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా మే5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పుడు తాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 21వ తేదీన సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ఓ ఫన్నీ వీడియో రిలీజ్ చేశారు. ఈవీడియోలో అల్లరి నరేష్ కెరీర్ లో గుర్తుండిపోయే గాలి శ్రీను, ఈసినిమాలో నటిస్తున్న శివ కుమార్ పాత్ర.. ఇలా రెండు పాత్రలు కలిసి మాట్లాడుకుంటున్నట్టు విభిన్నంగా వీడియోతో ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The most loved character ‘Gaali Seenu’ is here with a MASSive announcement 💥💥
Watch Now 🔥🔥
– https://t.co/TggSUcRoI6#Ugram #UgramOnMay5th @allarinaresh @mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @SricharanPakala @jungleemusicSTH pic.twitter.com/aQYEWctZbS— Shine Screens (@Shine_Screens) April 20, 2023
ఈ సినిమాలో ఈసినిమాలో అల్లరి నరేష్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాటలు అబ్బూరి రవి అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. మరి చూద్దాం ఈసినిమా ఎంతవరకూ ప్రేక్షకులను అలరిస్తుందో.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: