కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష. కెరీర్ లో మొదటి సారి డిఫరెంట్ జోనర్ లో తేజ్ ఈసినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమాకు మొదటి నుండి పాజిటివ్ బజ్ క్రియేటివ్ అయింది. రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ వరకూ అన్ని అప్ డేట్స్ సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో ఈసినిమా పాజిటివ్ రిపోర్ట్స్ సైతం అందుకున్నాయి. తాజా సమాచారం ఈసినిమాను స్పెషల్ స్క్రీనింగ్ ను ప్రైవేట్ గా ఇండస్ట్రీలో కొంతమందికి వేశారట చిత్రయూనిట్. ఇక సినిమా చూసిన వారందరూ సినిమాకు పాజిటివ్ రివ్యూనే ఇచ్చినట్టు తెలుస్తుంది. మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాకు ఆద్యంతం గ్రిప్పింగ్ నెరేషన్ తో థ్రిల్ ను మైన్ టైన్ చేయడంలో చిత్రయూనిట్ సక్సెస్ అయిందని.. ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమా అంతా చాలా ఎంగేజింగ్ గా ఉందని తెలిపినట్టు సమాచారం. ముఖ్యంగా బీజియం, సినిమాటోగ్రఫి సినిమాకు మరింత వాల్యూని పెంచాయని.. మం చి కథకు ఈరెండూ హైలెట్ గా నిలిచాయని అంటున్నారు. మరి చూద్దాం ప్రేక్షకులకు ఈసినిమా ఎంత వరకూ నచ్చుతుందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: