పోల్ :ఈ హీరోయిన్లలో పవన్ సరసన ఎవరు బాగుంటారు ? 

Who Do You Think Is The Perfect Pair For Powerstar Pawan Kalyan?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు వున్నాయి.ఇందులో ఒకటి షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అదే వినోదయసీతం రీమేక్.సముధ్రఖని తెరకెక్కిస్తున్నాడు.పవన్ తోపాటు సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు.ప్రియా ప్రకాష్ వారియర్,కేతిక శర్మ,రోహిణి,తనికెళ్ల భరణి,బ్రహ్మజీ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈజులై 28న ఈసినిమా విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇది కాకుండా పవన్ ప్రస్తుతం హరి హర వీరమల్లు,ఉస్తాద్ భగత్ సింగ్,ఓజి లో నటిస్తున్నాడు.ఇందులో హరి హర వీరమల్లు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.ఈసినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను ఎఎమ్ రత్నం నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ఇటీవలే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ప్రస్తుతం పవన్ ఓజిలో నటిస్తున్నాడు.మొదటి షెడ్యూల్ ముంబైలో జరుగుతుంది.సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.డివివి దానయ్య నిర్మిస్తున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలావుంటే నిధి అగర్వాల్,శ్రీలీల, ప్రియాంక మోహన్ లకు పవన్ కళ్యాణ్ తో నటించడం ఇదే మొదటిసారి.మరి వీరిలో ఎవరి పెయిర్ బాగుంటుందో వోట్ ద్వారా తెలపండి.

పవన్ తో స్క్రీన్ పై ఏ హీరోయిన్ ను చూడాలనుకుంటున్నారు ?👇

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =