మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్ట్ లో సౌత్ హవా

south indian movie domination in movie database site IMDb

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ మధ్య పోటీ వాతావరణం చాలానే ఉండేది. ఇప్పుడంటే పరిస్థితులు మారాయి కానీ మొదటినుండి అన్ని రంగాలతోపాటు సినిమారంగంలో ఆ పోటా పోటీ అనేది మాత్రం ఉండేది. నిజానికి బాలీవుడ్ కంటే కాస్త తక్కువే అయినా కానీ నార్త్ డామినేషన్ మాత్రం ఇండియన్ సినిమాపై బాగా ఉండేది. కానీ రాను రాను ఆ పరిస్థితి మారింది. ముఖ్యంగా రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తా మరో రేంజ్ కు వెళ్లింది. ఇక ఆతరువాత పాన్ ఇండియా సినిమాల జోరు పెరగడం మన తెలుగు సినిమాలు కూడా అక్కడ రిలీజ్ అవుతుండటం మొదలయ్యాయి. దానికితోడు గత రెండు మూడేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా మారిందో చూశాం. ఏసినిమా రిలీజ్ చేసినా.. ఎంత స్టార్ హీరో సినిమా అయినా డిజాస్టర్ నే మూటగట్టుకుంది. ఏదో ఈమధ్య వచ్చిన జవాన్ కాస్త ఊరటనిచ్చింది. మరోవైపు మన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లను సొంతంచేసుకున్నాయి. ఈమధ్య కాలంలో చాలా సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను కొట్టి దూసుకుపోయాయి. ఇక ఆర్ఆర్ఆర్ తో తెలుగుతో పాటు, సౌత్ ఇండస్ట్రీకి అంతర్జాతీయ లెవల్లో గుర్తింపు దక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మూవీ డేట్ బేస్ సైట్ అయిన ఐఎమ్ డీబీ లో మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్ట్ లో మన సినిమాలు టాప్ 10 లో ప్లేస్ ను సొంతం చేసుకున్నాయంటేనే అర్థమవుతుంది తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది అని చెప్పడానికి. తాజాగా ఐఎమ్ డీబీ లో మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్ట్ ను రిలీజ్ చేయగా..అందులో సౌత్ ఇండియన్ హవా కనిపిస్తుంది. ఆలిస్ట్ మొదటి ప్లేస్ లో జవాన్ స్థానం దక్కించుకోగా దాని డైరెక్టర్ తమిళ్ డైరెక్టర్ అయిన అట్లీ, అలానే సెకండ్ ప్లేస్ లో ఉన్న యానిమల్ సినిమాకు డైరెక్టర్ తెలుగు డైరెక్టర్ అయిన సందీప్ వంగా, మన హీరో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మూడో స్థానం.. అలానే సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న ఛత్రపతి సినిమా 5వ స్థానం, తేజా సజ్జా హనుమాన్, నాగ చైతన్య కస్టడీ 9,10 స్థానాలు దక్కించుకున్నాయి. అందులోనూ ఈ లిస్ట్ లో స్ట్రైయిట్ సినిమాలు అయిన హనుమాన్, కస్డడీ సినిమాలు ఉండటం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 6 =