సూర్య42 టైటిల్ రిలీజ్

suriya 42 movie title announced

తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం తన నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా సూర్య 42. గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు. గోవా, చెన్నైతో పాటు పలు ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ లో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా నేడు ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఇప్పటి వరకూ సూర్య 42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరపగా తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాకు కంగువ అనే టైటిల్ ను ఖరారు చేశారు. కంగువ అనగా అగ్ని శక్తి ఉన్న శక్తిశాలుడు అని అర్థం. ఇక ఈసినిమా 10 భాషల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో అన్ని భాషలకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ టైటిల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. దీనితో పాటు ఈసినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయనున్నట్టు కూడా తెలిపారు. ఈసినిమాలో యాక్షన్ సన్నివేశాలు, అధిక స్థాయిలో విఎఫ్ఎక్స్, CGI వర్క్ ఎక్కువగా ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే 2024 ప్రారంభంలో విడుదల చేసేలా ప్లాన్ చేశారు.

కాగా శివ దర్శకత్వంలో ఈసినిమాలో సూర్య పలు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =