రిపబ్లిక్ తరువాత గ్యాప్ తీసుకొని సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం విరూపాక్ష.తన కెరీర్ లో మొదటిసారి డిఫ్రెంట్ జోనర్ లో తెరకెక్కిన ఈసినిమాతో ఈశుక్రవారం బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.ఇది పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.సాయి తేజ్ కి ఇదే మొదటి పాన్ ఇండియా రిలీజ్. టీజర్,ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడం,ప్రముఖ దర్శకుడు సుకుమార్, స్క్రీన్ ప్లే అందించడంతో విరూపాక్ష పై మంచి అంచనాలు వున్నాయి.నిన్న ఏలూరు లో ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగగా.. సినిమా విజయంపై యూనిట్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు కనిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమాకు సెన్సార్ నుండి అలాగే ఇండస్ట్రీ సర్కిల్ నుండి పాజిటివ్ టాక్ వచ్చిందని సమాచారం.హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.అయితే అందుకు కారణం సినిమాలో భయపెట్టే సన్నివేశాలు చాలా వున్నాయట అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అంతే తప్ప మరే ఇతరత్రా కారణం కాదు.ఇక సినిమా మాత్రం చాలా బాగుందని ట్విస్టులతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందట.నటీనటుల పెరఫార్మెన్స్ ,స్క్రీన్ ప్లే ,విజువల్స్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్ అయ్యాయట.మొత్తానికి ఫుల్ పాజిటివ్ వైబ్ తో విడుదలవుతున్న ఈసినిమా సాయి ధరమ్ తేజ్ కు సాలిడ్ హిట్ ఇచ్చేలాగే ఉందని టాక్. మరి ఈసినిమాతో సాయి ధరమ్ తేజ్ ఏలాంటి హిట్ కొడతాడో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.
కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: