ఏజెంట్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

akhil agent movie trailer release date fixed

యంగ్ హీరో అఖిల్ స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏజెంట్. ఈసినిమాతో మంచి సాలిడ్ హిట్ ను అందుకోవాలని చూస్తున్నాడు అఖిల్. ఈసినిమా కోసం అఖిల్ ఎంత కష్టపడ్డాడో తన మేకోవర్ చూస్తే అర్థమవుతుంది. కండలు తిరిగిన దేహంతో మంచి పవర్ రోల్ తో వస్తున్నట్టు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. ఇక ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 18న కాకినాడలో జరిగే బిగ్ ఈవెంట్‌ లో ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − one =