ఎప్పటినుండో సామ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దీనికి దర్శకత్వంలో వహిస్తుండటం సమంత లాంటి స్టార్ హీరోయిన్ నటిస్తుండటంతో సినిమాను ప్రకటించినప్పటినుండి ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ల దగ్గర నుండి ట్రైలర్ వరకూ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఈసినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందన్న విషయం మాత్రం అర్థమైపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఇప్పటికే విజయ్ దేవకొండ సామ్ కు తన బెస్ట్ విషెస్ ను అందించాడు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కూడా తన ట్విట్టర్ ద్వారా టీమ్ బెస్ట్ విషెస్ అందించాడు. శాకుంతలం సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆల్ ద బెస్ట్.. గుణ శేఖర్, నీలిమా, ఎస్వీసీ ఆల్ ద బెస్ట్.. స్వీటెస్ట్ లేడీ సమంత, ఇంకా మై మల్లు బ్రదర్ దేవ్ మోహన్ లకు బెస్ట్ విషెస్. ఇంకా చిన్న అతిథి పాత్రలో నటించిన అల్లు అర్హ నటన కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.. అల్లు అర్హను వెండి తెరకు పరిచయం చేస్తున్నందుకు గుణశేఖర్ గారికి థ్యాంక్స్.. అర్హ ను చాలా అపురూపంగా చూసుకున్నారు.. నాకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
All the best for #Shaakuntalam release . My best wishes for @Gunasekhar1 garu , @neelima_guna & @SVC_official for mounting up this epic project . My warmest wishes to my sweetest lady @Samanthaprabhu2 . My Mallu brother @ActorDevMohan & the entire team.
— Allu Arjun (@alluarjun) April 14, 2023
కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. విజువల్ వండర్‌గా త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా విడుదలవుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: