ఏజెంట్- రామ కృష్ణ ఫుల్ సాంగ్ రిలీజ్

rama krishna full song out from agent movie

అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. అయితే అఖిల్ మాత్రం సక్సెస్ ను చాలా లేటుగా చూశాడు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయిన తరువాత ఎట్టకేలకు నాలుగో సినిమాతో హిట్ ను కొట్టాడు. రీసెంట్ గానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే రొమాంటిక్ కామెడీతో వచ్చి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ రూపొందుతుంది. ఇక ఈసినిమా కోసం అఖిల్ కూడా తన మేకర్ ను పూర్తిగా మార్చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే మళ్లీ మళ్లీ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు రామకృష్ణ అనే పాటను రిలీజ్ చేస్తున్నరు. నిన్న ఈపాట ప్రోమో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రామ్ మిరయాల పాడిన ఈపాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

కాగా ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =