శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈసినిమాలో ఇద్దరూ నాని, కీర్తి సురేష్ కూడా తమ లోని మరో యాంగిల్ ను చూపించారు. అటు మాస్ లో కానీ, యాక్షన్ లో కానీ అన్ని విషయాల్లో ఇద్దరూ పోటీపడి మరి నటించారు. నిజానికి హీరోయిన్లకు ఇలాంటి పాత్రలు అరుదుగా దక్కుతుంటాయి. అలాంటప్పుడే వారు తమలోని ప్రతిభను చూపించాల్సి వస్తుంది. ముఖ్యంగా కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ కు ఇలాంటి పాత్ర దక్కడం దానికి తగ్గట్టుగానే తను కూడా వెన్నెల పాత్రకు ప్రాణం పోసి నటించడంతో తనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా చూసిన సినీ సెలబ్రిటీలు కూడా సినిమాపై, చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా కలెక్షన్స్ లో కూడా ఎక్కడా తగ్గలేదు. నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించి మేకర్స్ లాభాలను సైతం అందించింది. తొలి రోజు నుండి మొదలైన కలెక్షన్ల వర్షం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ రెండు వారాల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 111 పైగా కోట్ల గ్రాస్ ను అలానే 61 కోట్లకు పైగా షేర్ ను రాబట్టుకుంది. ఒక్క నైజాం లోనే ఈసినిమా 24.98 కోట్లను వసూలు చేసింది. మొత్తంగా ఇంతవరకూ ఈ సినిమా 12.82 కోట్ల లాభాలను రాబట్టిందని అంటున్నారు. యూఎస్ లో కూడా ఇప్పటికే 2 మిలియన్ డాలర్లను రాబట్టుకుంది. దీంతో నాని కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఈసినిమా నిలిచింది.
కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా…. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: