టాక్సిక్ సెన్సార్ కంప్లీట్… రన్ టైం ఎంతంటే ?

Yash’s Toxic Clears Censor; Runtime Revealed

‘కేజీఎఫ్’ చాప్టర్ 1 & 2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ . విలక్షణ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎపిక్‌పై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాను షేక్ చేసే ఒక బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రం తన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఏకంగా ‘A’ సర్టిఫికెట్‌ను పొందింది.

కేంద్ర సెన్సార్ బోర్డు అధికారికంగా ‘A’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అయితే ఈ సెన్సార్ రిపోర్ట్‌లో అందరినీ అత్యంత ఆశ్చర్యపరిచిన అంశం ఈ సినిమా రన్‌టైమ్ .ఈ సినిమా నిడివి ఏకంగా 3 గంటల 14 నిమిషాల 12 సెకన్లు ఉన్నట్లు సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా స్పష్టమైంది. ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇంతటి సుదీర్ఘమైన రన్‌టైమ్‌తో ఒక బిగ్ బడ్జెట్ పాన్-ఇండియా సినిమా రావడం ఇదే తొలిసారి.

ఈ సినిమాలో డ్రగ్ మాఫియా, గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్, రోమాలు నిక్కబొడుచుకునే రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నాయని సమాచారం.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కథను ఎంతో సహజంగా, రక్తాపాతంతో కూడిన యాక్షన్ ఘట్టాలతో తెరకెక్కించడం వల్లే సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది.ఆగస్టు 26న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.