దసరా 4డేస్ కలెక్షన్స్ – అన్ స్టాపబుల్  

Dasara Movie 4 Days Collections Worldwide

నాని నటించిన దసరా బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది. ఐపీఎల్ స్టార్ట్స్ కావడంతో ఆప్రభావం కొద్దిగా ఉన్నప్పటికీ సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూ బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. నిన్న,ఆదివారం ఈసినిమా సూపర్ హోల్డ్ ను కొనసాగించింది. దాంతో నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 87 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.రేపటి తో దసరా 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. నానికి ఇదే మొదటి 100 కోట్ల సినిమా కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా, ఆదివారం 6.40కోట్ల షేర్ ను రాబట్టడంతో నాలుగు రోజుల్లో మొత్తం 33 కోట్ల షేర్ ను కలెక్ట్  చేసింది. ముఖ్యంగా నైజాంలో ఈచిత్రం అదరగొడుతుంది. నాలుగు రోజుల్లో ఈసినిమా 14కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కావడంతో ఫుల్ రన్ లో డిస్ట్రిబ్యూటర్లకు దసరా భారీ లాభాలను తీసుకురానుంది.

అటు ఓవర్సీస్ లో ఈసినిమా 1.6మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి నాని ,జెర్సీ కలెక్షన్స్ ను బీట్ చేసింది. ఇంతకుముందు జెర్సీ అక్కడ 1.5మిలియన్ డాలర్లను రాబట్టింది. ఫుల్ రన్ లో దసరా 2మిలియన్ క్లబ్ లో చేరనుంది. ఓవరాల్ గా ఈసినిమా నాని కి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించడమే కాదు అతని మార్కెట్ ను కూడా పెంచింది. ఈసినిమాని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. చెరుకూరి సుధాకర్ నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =