సెన్సార్ పూర్తిచేసుకున్న మీటర్

kiran abbavarams meter movie completes censor formalities

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. చిన్నబ్యానర్ల నుండి పెద్ద బ్యానర్ల వరకూ మేకర్స్ ఈ యంగ్ హీరోతో సినిమాలను చేయడానికి బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అయితే కిరణ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. తన నుండి ప్రస్తుతానికి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా మీటర్. రమేశ్ కాడూరి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్న ఈసినిమాలో కిరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉండటంతో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ను ఇచ్చింది. ఈ చిత్రం 127 నిమిషాల రన్ టైమ్ ను కలిగి ఉంది.

కాగా ఈసినిమాలో అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అతుల్య రవి కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. 2017లోనే కోలీవుడ్ కి పరిచయమైన అతుల్య ఈ సినిమాతో ఇక్కడ ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈసినిమా ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ కానుంది. ఈసినిమాతో కిరణ్ అబ్బవరం ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.