NBK 108 లో అఫీషియల్ గా అడుగుపెట్టిన కాజల్

kajal aggarwal on board in NBK 108 movie

బాలకృష్ణ-అనిల్ రావిపూడిలాంటి క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఇప్పటికే రెండు వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అఖండ, ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందించాయి. దీంతో ఇప్పుడు హ్యాట్రిక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే అనిల్ కూడా ఎఫ్3 తో తన హిట్స్ లిస్ట్ లో మరో హిట్ ను చేర్చుకున్నాడు. అందుకే వీరి సినిమాపై మొదటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకూ కామెడీ యాంగిల్ తో అలరించిన అనిల్ రావిపూడి ఇప్పుడు బాలకృష్ణతో మాస్ ఎంటర్ టైనర్ తీయబోతున్నాడు. ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ తో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో నటిస్తున్న పాత్రలను ఒక్కొక్కరిగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటిస్తున్నారు. రీసెంట్ గానే శ్రీలీల కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేస్తూ షూట్ జాయిన్ అవుతున్నట్టు తెలిపారు. ఇక ఇప్పుడు ఈసినిమాలో కథనాయికగా నటిస్తున్న కాజల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాలో ఎప్పటినుండో కాజల్ నటిస్తున్నట్టు వార్తలు అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. తాజాగా అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసి క్లారిటీ ఇచ్చారు. నటసింహతో నటించడానికి టాలెంటెడ్ యాక్ట్రస్ కాజల్ వచ్చేసింది అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

కాగా ఈసినిమాలో శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ప్రియాంక జవాల్కర్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈసినిమాలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల అలరించనుందంట. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + three =