నార్త్ అమెరికాలో అదరగొడుతున్న పెద్ది

Peddi Enters the $2 Million Club in North America

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం నార్త్ అమెరికా (ఉత్తర అమెరికా) బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరి సరికొత్త మైలురాయిని అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బుధవారం నాటి ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమా అక్కడ ప్రభంజనం సృష్టించింది. కేవలం ప్రీమియర్ల ద్వారానే 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసి రామ్ చరణ్ సోలో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఆ తర్వాత గురు, శుక్రవారాల్లోనూ అదే జోరును కొనసాగిస్తూ కేవలం రెండు రోజుల్లోనే ఈ ప్రతిష్టాత్మక 2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత వేగంగా ఈ క్లబ్‌లో చేరిన సోలో హీరో చిత్రంగా ‘పెద్ది’ రికార్డు క్రియేట్ చేసింది.రెండు రోజుల్లోనే ఈసినిమా అక్కడ 2.2 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టుకుంది. ఈ వీకెండ్ లో 3 మిలియన్ క్లబ్ లో చేరనుంది.

నార్త్ అమెరికాలోనే కాకుండా మిగిలిన ఓవర్సీస్ మార్కెట్లు అయిన యూకే, గల్ఫ్, ఆస్ట్రేలియాల్లోనూ ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ. 135 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ చిత్రం, వీకెండ్ ముగిసే సమయానికి మరిన్ని భారీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.